![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో తేజ ఒకడు. తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు జబర్దస్త్ లో కమెడియన్ గా నటించాడు. ఐతే ఈరోజు తేజ ఇలా ఒక సెలబ్రిటీ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే తనసలు ప్రజలకు తెలిసేవాడినే కాదన్నారు తేజ. ఇటు బుల్లితెరతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో 200కి పైగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఐతే జబర్దస్త్ లో కనిపించినా, బిగ్ బాస్ లో కనిపించినా ఫ్యూచర్ చాల బ్రైట్ గా ఉంటుంది అనడానికి చాలా మంది ఉదాహరణులుగా ఉన్నారు.
టేస్టీ తేజకి ఇన్ స్టాగ్రామ్ లో 192K ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో కాస్త తెలివితేటలు ఉంది ఇతనికే అనిపించిన వ్యక్తి ఇతనే. హౌస్ లో అందరితో కామెడీగా ఉన్న టేస్టీ తేజ.. సీరియల్ బ్యాచ్ తో ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ దృష్టిలో నెగెటివ్ మార్కులు పడ్డాయి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక తేజకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఫుడ్ వ్లాగ్స్, సినిమా ప్రమోషన్స్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇక నేడు టేస్టీ తేజ బర్త్ డే సందర్భంగా అందరు తనకి విషెస్ చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం డైరెక్ట్ గా అతని ఇంటికెళ్ళి మరీ సెలబ్రేట్ చేసారు. వాళ్లే బిగ్ బాస్ హౌస్ మేట్స్ శుభశ్రీ రాయగురు, ప్రియాంక జైన్.. వీరితో పాటు ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ కూడా వచ్చాడు. ఇక వీళ్ళు కలిసి తేజ బర్త్ డే ని గ్రాంఢ్ గా సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ వీడియోని తేజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. శోభాశెట్టితో కలసి చేసిన ఓ రీల్ ని పుట్టిన రోజు సందర్భంగా తనకి ట్యాగ్ చేస్తూ ఓ రీల్ ని షేర్ చేసింది శోభాశెట్టి. ఇక ప్రస్తుతం అతనకి నెటిజన్ల నుండి ఫుల్ కామెంట్లు, విషెస్ వస్తున్నాయి.
![]() |
![]() |